జాతీయ వార్తలు

100కుపైగా స్థానాల్లో కాంగ్రెస్ లీడ్.. బీజేపీ నుంచి గట్టి పోటీ .. కీలకంగా మారిన జేడీఎస్..

KPS డిజిటల్ నెట్‌వర్క్, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొదట ఓట్ ఫ్రమ్ హోమ్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. హోరీహోరీగా పోటీ కొనసాగుతోంది. 100కుపైగా స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో జేడీఎస్ కీలకంగా మారనుంది.

కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. 113 స్థానాలు గెలిచిన పార్టీకి అధికారం దక్కుతుంది. ఈ ఎన్నికల్లో 73.19 శాతం పోలింగ్‌ నమోదైంది. 2,615 మంది అభ్యర్థుల పోటీలో ఉన్నారు. హంగ్ వస్తే పరిస్థితి ఏంటన్నదానిపై చర్చ నడుస్తోంది. క్యాంప్ రాజకీయాలు షురూ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

వరుణ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య పోటీ చేశారు. కనకపుర నుంచి బరిలో డీకే శివకుమార్ హుబ్బళి ధార్వాడ్ సెంట్రల్ నుంచి జగదీష్ శెట్టర్, శిగ్గావి నుంచి సీఎం బస్వరాజ్ బొమ్మై బరిలో ఉన్నారు.

చన్నపట్న నుంచి కుమారస్వామి పోటీలో ఉన్నారు.

దేశవ్యాప్తంగా కర్ణాటక ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోనూ భారీగా పందేలు కాస్తున్నారు. కోట్లలో వ్యాపారం జరుగుతోందని అంచనా వేస్తున్నారు.

Leave a Reply