జాతీయ వార్తలు

లేడీ సింగం మృతిపై అనుమానాలు.. ఆడియో, వీడియో క్లిప్పులు వైరల్‌

KPS డిజిటల్ నెట్‌వర్క్, వెబ్ డెస్క్: లేడీ సింగంగా పేరు పొందిన అస్సాం పోలీసాఫీసర్ జున్ముణి రాభా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై అనుమనాలు వ్యక్తం చేస్తున్న ఓ ఆడియో క్లిప్‌తోపాటు మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడం కలకలం రేపుతోంది. పోలీసు శాఖలోని కొందరు అధికారులు ఆమెను చిత్రహింసలు పెట్టి చంపారని పేర్కొంటున్న ఓ కానిస్టేబుల్‌ ఆ ఆడియో క్లిప్‌ విడుదల చేశాడు. మరోవైపు ప్రమాద సమయంలో రాభా వాహనం ట్రక్కును ఢీకొనలేదని ప్రత్యక్ష సాక్షిగా చెబుతున్న వ్యక్తి వీడియోలో పేర్కొన్నాడు. ఆమె కారు నిలిపే ఉందని, ట్రక్కు వచ్చి వాహనాన్ని బలంగా ఢీకొట్టిందని తెలిపాడు. అయితే ట్రక్కు ఢీకొట్టే ముందు కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగారన్నాడు. ఇప్పటికే రాభా అనుమానాస్పద మరణంపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply