గ్యాలరీవీడియోస్

జీవో నెంబర్ 225 ఇళ్ల పట్టాల పై అవగాహన కల్పించిన కార్పొరేటర్ గంకల

విశాఖపట్నం : 48 వ వార్డు కార్పొరేటర్ జివిఎంసి భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు సచివాలయ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది తో కలిసి వార్డులో పర్యటించి జీవో నెంబర్ 225 ఇళ్ల పట్టాల కొరకు ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.

భాజపా విశాఖ పార్లమెంటు జిల్లా కోర్ కమిటీ సభ్యులు కప్పరాడ మండల (47 48 డివిజన్ల) అధ్యక్షులు గంకల అప్పారావు గారు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 225 ప్రకారం 15-10-2019 ముందు ఇంటి పన్ను కలిగి ఉండి ఆ యొక్క స్థలంలోనే నివాసం ఉంటున్న 75 గజాల కన్నా తక్కువ స్థలం ఉన్నవారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని 75 గజాలు పైబడిన వారికి ప్రభుత్వం నిర్దేశించిన శ్లాబుల ప్రకారం రుసుము వసూలు చేయడం జరుగుతుందని ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఇళ్ల పట్టాలు కొరకు సచివాలయంలో రెవెన్యూ సిబ్బంది లేదా టౌన్ ప్లానింగ్ సిబ్బంది వద్ద అప్లై చేసుకోవాలని ఏదైనా సమస్య ఉంటే తన వద్దకు తీసుకు వస్తే సమస్యలు పరిష్కరించి ప్రతిఒక్కరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది.

Leave a Reply