Uncategorized

అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

KPS డిజిటల్ నెట్‌వర్క్, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖా సూచిస్తుంది. ఇప్పటికే పట్టణాల్లోని కాలనీలోకి, పొలాల్లోకి నీళ్లు చేరాయి. తెలంగాణ, ఏపీలో అపార పంటనష్టం వాటిల్లింది. ఏపీలో పిడుగులు పడొచ్చని వార్నింగ్ కూడా ఇచ్చింది వాతావరణ శాఖ. వర్షం వచ్చేటప్పుడు చెట్ల క్రింద ఉండొద్దంటూ ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు అధికారులు. సకాలంలో రాని వర్షాలు.. ఆకాలంలో దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలపై పగబట్టినట్లు కుండపోతతో విజృంభిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది.

ఇప్పటికే ఏపీ లోని పలు ప్రాంతాల్లో వరుణుడు విజృంభిస్తున్నాడు. పశ్చిమ విదర్భ నుంచి మరాఠడ్వా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతుందని వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఉరుములు, వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు చెబుతోంది. మరోవైపు, అకాల వర్షానికి వరి పంటంతా నీటిపాలు అయిందని రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈదురు గాలులకు మామిడి పంటంతా నేలరాలడంతో రైతులు తల్లడిల్లుతున్నారు.

Leave a Reply