ఆంధ్రప్రదేశ్

పెండింగ్ జరిమానాలు తక్షణమే చెల్లించండి

KPS డిజిటల్ నెట్‌వర్క్, విశాఖపట్నం: రవాణా శాఖ తనిఖీల్లో కేసులు నమోదైన వాహనాలకు సంబంధించిన జరిమానాలను సంబంధీకులు వెంటనే చెల్లించాలని రవాణాశాఖ డీటీవో రాజారత్నం గురువారం తెలిపారు. పెండింగ్ చాలానాలున్న వాహనాల కోసం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని సంబంధిత వాహనం పట్టుబడితే వాహనాలు సీజ్ చేస్తామన్నారు. 15 రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో 244 వాహనాల నుంచి 20 లక్షల మేర అపరాధరుసుం విధించామని సంబంధిత వాహనదారులు జరిమానాలు చెల్లించాలని సూచించారు.

Leave a Reply