ఆంధ్రప్రదేశ్

వివేకా లేఖపై నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు అనుమతి

KPS డిజిటల్ నెట్‌వర్క్, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య సమయంలో వివేకా రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. ఈ లేఖపై వేలిముద్రలు గుర్తింపునకు ఈ టెస్ట్ ఉపయోగపడనుంది. 2021 ఫిబ్రవరి 11న లేఖను ఢీల్లీలోని సీఎఫ్‌ఎస్‌ఎల్‌(CFSL)కు సీబీఐ పంపింది. లేఖను పరీక్షించిన అక్కడి నిపుణులు తీవ్ర ఒత్తిడిలో వివేకా రాసిన లేఖగా తేల్చారు. దీంతో చేతి రాతతో పాటు వేలిముద్రలు కూడా గుర్తించేందుకు నిన్‌హైడ్రిన్‌ పరీక్ష నిర్వహించాలని సీబీఐ అధికారులు కోరారు. అయితే ఈ టెస్ట్ లేఖపై రాతతో పాటు ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని CFSL తెలిపింది. ఈ నేపథ్యంలో అధికారులు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. రికార్డుల్లో ఒరిజినల్‌ లేఖ బదులు కలర్‌ జిరాక్స్‌ అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం నిన్‌ హైడ్రిన్‌ పరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Leave a Reply