తెలంగాణ

పవన్ కళ్యాణ్ కు దేశ, విదేశాల్లో రామ్ చరణ్ మద్దతు

హైద్రాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మద్దతుగా రామ్ చరణ్ ప్రకటించారు. ఆదివారం నాడు హైద్రాబాద్ లో జరిగిన రామ్ చరణ్ యువశక్తీ ఈ నిరయాన్ని తీసుకుంది. ఈ సమావేశంలో ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, తమిళ్, మహారాష్ట్ర కు చెందిన అభిమానులు హాజరయ్యారు. అల్ ఇండియా రాంచరణ్ అధ్యక్ష కార్యదర్శులు, అభిమానులు హాజరయ్యారు.

వారంతా ఏకగ్రీవంగా పవన్ కు ఆమోదం తెలిపారు. ఇప్పటికే నాగబాబు, చిరంజీవి తో పాటు ఆయన కుటుంబీకులు కూడా మద్దతు తెలిపారు. పవన్ కు ఆంధ్రలో ఎదురైనా అనుభవాలు, అభిమానులను అరెస్ట్ చేయటం వంటి విషయాలు తెలిసిన విషయమే. ఈ సంమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కొద్దిరోజుల్లో అవి ప్రకటించనున్నారు.

కాగా, సోమవారం నాడు. యు.ఎస్. లో చిరంజీవి ఆల్ ఇండియా ఫాన్స్ అధ్యక్షుడు అక్కడ అభిమాలతో సమావేశం అవుతున్నారు. జనసేన పార్టీకి పూర్తి మద్దతు వారు ఇప్పటికే ఇచ్చారు.

Leave a Reply