తెలంగాణ

తెలంగాణపై.. బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ కక్ష సాధిస్తోంది: కేసిఆర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో కేంద్ర బీజేపీ పై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం తనపైనా.. తెలంగాణపై.. బీఆర్ఎస్ పార్టీపైనా కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తూ.. పార్టీ మానసిక ధైర్యాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని సీఎం హెచ్చరించారు. అధికార బీజేపీ పై పచ్చిగడ్డి వేస్తె భగ్గుమనే విధంగా ఉన్న సీఎం కేసీఆర్.. బీజేపీ ఎత్తులను చిత్తు చేద్దామని మంత్రివర్గ సమావేశంలో పార్టీ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై.. మోదీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. విపక్షాలను కూడగట్టుకుని పోరాడదామని కేసీఆర్ అన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయం సాదించటామే కాక, తిరుగులేని మెజారిటీతో గెలుస్తుందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామని.. ఎన్నికలు దగ్గర పడుతున్నందున మంత్రులు అభివృద్ధిపై దృష్టిసారించాలని, తమ తమ జిల్లాల్లో పెద్దన్నపాత్ర పోషించాలని మంత్రులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. కేంద్ర బీజేపీ విధానాలను ఎండగట్టాలని మంత్రులకు సూచించారు.

Leave a Reply