ఆంధ్రప్రదేశ్

మహిళా చట్టాలపై అవగాహన అవసరం

ఇచ్చాపురం : మహిళా చట్టాలపై ప్రతి మహిళకు అవగాహన కలిగి ఉండాలని సోంపేట అ నపు జూనియర్ సివిల్ జడ్జి ఎ. రాము అన్నారు. మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా శుక్రవారం సోంపేట సామాజిక ఆస్పత్రిలో వైద్యసిబ్బందికి న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహలతో కలిగే నష్టాలను అందరికీ వివరించాలన్నారు. కార్యక్రమంలో సామాజిక ఆస్పత్రి వైద్యుడు. తుంగాన వెంకటేష్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply