జాతీయ వార్తలు

కరోనా కొత్త వేరియంట్.. కేంద్రం కీలక సూచనలు..

KPS డిజిటల్ నెట్‌వర్క్, ఢిల్లీ :- దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కేరళ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ JN-వన్ గుర్తించారు. దీంతో కేంద్రం రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. ఇప్పటి వరకు ఈ వేరియంట్ వలన ఐదుగురు మృతి చెందారు. ఈ మృతుల్లో నలుగురు కేరళ వారు కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో అలర్ట్‌గా ఉండాలని.. RT-PCR టెస్టులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. అలాగే పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని కేంద్రం కోరింది. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.

కోవిడ్ కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి , సంబంధించిన టెస్టులు చేయించుకోవాలన్నారు. రాష్ట్రాల్లో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రాష్ట్రాలు,జిల్లాల్లో సమీక్షలు నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు కోవిడ్ పరిస్థతిపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది .

Leave a Reply