ఆంధ్రప్రదేశ్

పిఠాపురం మే సవాల్! సేనాని vs వైసీపీ

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పిఠాపురం :- పవన్.. పిఠాపురం.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నవి ఈ రెండే ..రీజన్.. పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగడమే కాదు. ఎన్నికలే పెండింగ్.. నా విక్టరీ ఎప్పుడో అయిపోయింది. ఇది పవన్ కాన్ఫిడెన్స్.. ఆట అప్పుడే అయిపోలేదు.. ముందుంది అసలు సినిమా.. ఇది వైసీపీ నేతల కౌంటర్ డైలాగ్స్..మరి నిజంగా పిఠాపురంలో పవన్‌ గెలిచినట్టేనా? ఆయన ఎక్స్‌పెక్ట్ చేసినట్టు లక్ష మెజారిటీ వస్తుందా? వైసీపీ నేతలు వేస్తున్న కౌంటర్ స్కెచ్‌ ఏంటి?

పిఠాపురం పాలిటిక్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారాయి.. తన గెలుపు నల్లేరుపై నడక.. లక్ష మెజార్టీ కన్ఫామ్‌ అనేది జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా.. అసలు ఓటు వేయడమే లేటు.. ప్రమాణస్వీకారం చేయడమే పెండింగ్ అన్నారు.. అలా అంటూనే.. గెలిపించండి అంటూ ఎప్పుడు లేనిది చెతులెత్తి దండం పెట్టారు.. పదేళ్ల తర్వాత నోరు తెరిచి అడుగుతున్నాను.. నాకే ఓటు వేయండి అన్నారు. అడగనిదే అమ్మైనా పెట్టదు.. అందుకే అడుగుతున్నాను.. నన్ను గెలిపించండి.. జనసేన అభ్యర్థులను గెలిపించండి. ఇది పవన్ వర్షన్.. మొత్తంగా చూస్తే గెలుపుపై పవన్‌ ఫుల్‌ ధీమాలో ఉన్నారు పవన్.. అసలు పవన్ పిఠాపురాన్ని ఎందుకు సెలక్ట్ చేసుకున్నారు..

2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పవన్ పోటీ చేశారు.. ఆ రెండు స్థానాల్లో ఓడిపోయారు.. కానీ ఈసారి మాత్రం కేవలం పవన్ ఓన్లీ పిఠాపురం నుంచే బరిలోకి దిగుతున్నారు..దీని బట్టే అర్థమవుతోంది ఆయనకు అక్కడ కచ్చితంగా గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ ఉందని. అయితే ఈ కాన్ఫిడెన్స్‌ వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి..పిఠాపురంలో దాదాపు 91 వేల కాపు సామాజికవర్గ ఓటర్లు ఉన్నారు.. వీరే నేతల గెలుపోటములను డిసైడ్ చేసేఇంది. నిజానికి 2019లో కూడా పిఠాపురం నుంచే పవన్‌ బరిలోకి దిగాలని చాలా మంది సజెస్ట్ చేశారు.. కానీ పవన్ సింపుల్‌గా నో చెప్పేశారని టాక్. ఈసారి మాత్రం పిఠాపురాన్ని సెలెక్ట్ చేసుకొని సర్వేలు చేయించారు. అన్ని సర్వేల్లో పవన్‌కు రిజల్ట్‌ పాజిటివ్‌గా వచ్చిందని జనసేన నేతలు చెబుతున్నారు. సర్వేలు అనుకూలంగా ఉన్నాయి.. అండగా ఉండే కాపు ఓటర్లు.. ఇతర క్యాస్ట్‌కు చెందిన యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌.. ఇటీవల పవన్ నిర్వహించిన వారాహీ టూర్‌కు వచ్చిన రెస్పాన్స్‌.. ఇవన్నీ లెక్కలు వెసుకున్న పవన్.. పిఠాపురంలో తన విక్టరీ చాలా ఈజీ అనే థాట్‌లో ఉన్నారు..

ఇదంతా పవన్.. జనసేన వర్షన్.. మరీ అధికార వైసీపీ సంగతేంటి? నిజంగా పవన్‌కు అంత అప్పనంగా పిఠాపురాన్ని అప్పగించేస్తారా? అంటే నో అనే చెప్పాలి.. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లోనూ పవన్‌ ఓడించిన వైసీపీ.. ముచ్చటగా మూడో నియోజకవర్గంలో ఓడించి.. హ్యాట్రిక్‌ డిఫీట్‌ను ఆయన అకౌంట్‌లో వేయాలని చూస్తోంది..

పిఠాపురం నుంచి పవన్ బరిలోకి దిగుతారన్న ప్రచారం మొదలవగానే అలర్ట్ అయ్యారు జగన్.. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును పక్కన పెట్టేసి, కాకినాడ ఎంపీ వంగా గీతను తెరపైకి తెచ్చింది. దీంతో పిఠాపురం పాలిటిక్స్‌ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారాయి.. ఫర్ ది ఫ్యాక్ట్.. వంగా గీత పొలిటికల్ కెరీర్ పీఆర్పీ నుంచే మొదలైందని చెప్పాలి.. 2009లో పీఆర్పీ నుంచి ఇదే నియోజకవర్గం బరిలో నిలిచి గెలిచారు వంగా గీత.. అలాంటి గీతే… ఇప్పుడు పవన్ ప్రత్యర్థి.. ఎంపీగా ఉన్న సమయంలోనే పిఠాపురంపై గీత స్పెషల్ ఫోకస్ పెట్టారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మెజారిటీ వాటా పిఠాపురానికే దక్కింది. ఇటీవల ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారు.. ఇవన్నీ కాదు.. పవన్‌ నోటి నుంచి గెలిచేశాను.. లక్ష మెజార్టీ అనే వర్డ్స్ రాగానే.. వైసీపీ పెద్దల కళ్లు పిఠాపురంపై పడేలా చేశాయి.. పవదన్‌ది కాన్ఫిడెన్స్‌ కాదు.. ఓవర్ కాన్ఫిడెన్స్‌ అని ప్రూవ్ చేయాలని తహతహలాడుతున్నాయి.. ఎస్పెషల్లీ సీఎం జగన్‌ ఇప్పుడు పిఠాపురంపై ఫోకస్ చేశారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.. వైసీపీది కూడా సేమ్ స్ట్రాటజీ.. ఏ సామాజిక వర్గాన్నైతే పవన్ నమ్ముకున్నారో.. అదే సామాజికవర్గ నేతలను పవన్‌కు వ్యతిరేకంగా బరిలోకి దింపుతున్నారు.. ఇప్పటికే పిఠాపురం నేతలతో కాపు రిజర్వేషన్‌ ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చర్చలు ప్రారంభించేశారు..

ఓవరాల్‌గా చూస్తే.. వంగా గీతకు అనుకూలంగా పరిస్థితులు మార్చేందుకు తెర వెనుక మంత్రాంగం మొదలైంది. అంతేకాదు నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాలకు.. ముగ్గురు కీలక నేతలను ఇంచార్జ్‌లుగా అప్పాయింట్ చేసింది వైసీపీ.. పిఠాపురం మండలం బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డికి.. కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజా..గొల్లప్రోలు మండలం బాధ్యతలు మాజీ మంత్రి కన్నబాబు.. నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ వైపు తిప్పే బాధ్యతలు ముద్రగడకు.. వీరు ముగ్గురే కాక.. నియోజకవర్గానికి ప్రత్యేక ఇంచార్జ్‌గా ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.. ఒక్కో నేతకు ఒక్కో టాస్క్.. మండలాల ఇంచార్జ్‌లు అన్ని వర్గాలతో చర్చలు జరపడం.. ఆ మండలాల్లో వైసీపీకి అనుకూలంగా పరిస్థితులను మార్చడం..ఆర్థికపరమైన అంశాలను చూసుకునేందుకు ద్వారంపూడి..ఇక కాపు నేతలను సముదాయించే పని ముద్రగడకు.. ఇలా సరికొత్త స్ట్రాటజీతో పవన్‌కు షాక్ ఇచ్చేందుకు గ్రౌండ్‌ను ప్రిపేర్ చేస్తున్నారు..

అటు జనసేన, ఇటు వైసీపీ కూడా ఆపరరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపారు పిఠాపురంలో.. ఏకంగా వైసీపీ అభ్యర్థి వంగా గీతను జనసేనలో చేరాలని ఇన్వైట్ చేశారు పవన్.. కానీ వైసీపీ మాత్రం జనసేన, టీడీపీ నేతలను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది.. ఇదంతా పవన్‌కు భయపడి చేస్తున్నారా? లేదంటే ఎలాగైనా ఓడించాలనే కసితో చేస్తున్నారా? మరి ఏ పార్టీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతోంది? ఏ పార్టీ గెలుస్తుంది? వైసీపీ ఎత్తుల ముందు జనసేనాని చిత్తవుతారా? పవన్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నట్టు లక్ష మెజార్టీ వస్తుందా?

Leave a Reply