జాతీయ వార్తలు

కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారా, కొత్త సీఎం వస్తారా?

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, న్యూఢిల్లీ :- ఢిల్లీ ముఖ్యమంత్రి(delhi CM) అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) అరెస్ట్ తర్వాత ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారా లేదా కొత్త సీఎంగా ఎవరినైనా ఎంపిక చేస్తారా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

ఢిల్లీ ముఖ్యమంత్రి(delhi CM) అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) అరెస్ట్ తర్వాత ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అరెస్ట్ తర్వాత అనేక చోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు కేజ్రీవాల్‌ను ఈడీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వాన్ని(delhi government) ఎవరు నడిపిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారా లేదా కొత్త సీఎం(new cm)గా ఎవరినైనా ఎంపిక చేస్తారా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

ముఖ్యమంత్రి జైలుకు వెళితే ఢిల్లీ సీఎం ఎవరన్న చర్చ సర్వత్రా నెలకొంది. అయితే దీనిపై కేజ్రీవాల్ అరెస్ట్(arvind kejriwal arrest) అయితే ఎంటీ పరిస్థితి అని ఆప్ సిగ్నేచర్ క్యాంపెయిన్‌ను గతంలో నిర్వహించింది. అందులో 90 శాతం మంది ముఖ్యమంత్రి జైలు నుంచే ఢిల్లీని పరిపాలిస్తారని చెప్పారు. దీంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా తమ అధినేత కేజ్రీవాల్ జైలు నుంచే ఢిల్లీని పాలిస్తారని అన్నారు. జైల్లోనే ప్రభుత్వాన్ని నడిపిస్తానని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి(Atishi Marlena) కూడా అన్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపకుండా అడ్డుకునే చట్టం ఏదీ లేదని వెల్లడించారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు నిర్ణయించుకున్నారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ గోయల్ కూడా స్పష్టం చేశారు.

నెక్ట్స్ సీఎం ఎవరు?

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ(aam aadmi party)లో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ కూడా మొదలైంది. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ జైలులో ఉండటంతో మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ మాత్రమే ప్రస్తుతం కీలక నేతలుగా ఉన్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ కూడా అధికారం చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సీఎంగా ఉండగా అరెస్ట్ అయిన తొలి నేత

దేశంలోనే పదవిలో ఉండగానే అరెస్టయిన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్(arvind kejriwal) కావడం విశేషం. అయితే దీనికి ముందు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఆయన కార్యాలయంలో ఉండగానే ఈడీ అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత రాజ్‌భవన్‌కు తీసుకెళ్లి, గవర్నర్‌కు రాజీనామా సమర్పించడానికి అవకాశం ఇచ్చింది.

Leave a Reply