ఆంధ్రప్రదేశ్

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి సీఎం వైఎస్ జగన్ లేఖ

అమరావతి : కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌కి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. బహ్రెయిన్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థ యాజమాన్యం చేతిలో చాలా మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో చాలా మంది ఏపీకి చెందిన వారు ఉన్నారన్నారు. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ కోరారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని సీఎం తెలిపారు.

Leave a Reply