జాతీయ వార్తలు

డేంజర్ జోన్‌లో భారత్ నగరాలు !

KPS డిజిటల్ నెట్‌వర్క్, ఢిల్లీ :- భూకంపాల చరిత్ర భారతదేశానికి కూడా ఉంది. మహారాష్ట్రలోని లాతూర్, గుజరాత్ లోని భుజ్‌ ప్రాంతాల్లో సంభవించిన భూకంపాలు అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. పెద్ద ఎత్తున ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించాయి. అనేక గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఇదిలాఉంటే మనదేశంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ డేంజర్ జోన్‌లో ఉన్నాయి. నిబంధనలను గాలికొదిలేసి ఆకాశాన్ని తాకే భవనాలను నిర్మించడం మానుకోవాలి.

భారత్‌ కూడా భూకంపాల బాధిత దేశమే. భూకంపం అనగానే మనదేశంలో ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది..భుజ్. 2001 జనవరి 26న యావత్ భారతదేశం రిపబ్లిక్ వేడుకలు చేసుకుంటున్న సమయంలోభుజ్ లో భూమి కంపించింది. కచ్ జిల్లా ఛోబారి గ్రామానికి తొమ్మిది కిలోమీటర్ల దూరాన భూకంప కేంద్రం ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 7.7 గా నమోదైంది. భుజ్ భూకంపంలో 20 వేలమందికిపైగా చనిపోయారు. లక్షా 67 వేల మంది గాయపడ్డారు. దాదాపు నాలుగు లక్షల ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపంతో భుజ్‌ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. భుజ్ ఒక్కటే కాదు, కచ్ ప్రాంతంలోనూ పెద్ద ఎత్తున ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించాయి.

భుజ్‌, లాతూర్ భూకంపాల సమాచారం అందిన వెంటనే భారత సైన్యం అప్రమత్తమైంది. హుటాహుటిన రంగంలోకి దిగింది. సహయక చర్యల్లో పాల్గొంది. బాధితులకు అండగా నిలిచింది. బాధితులను ఆదుకోవడానికి రెడ్ క్రాస్ సంస్థ కూడా ముందుకొచ్చింది. భుజ్‌లో యుద్ధ ప్రాతిపదికన ఆస్పత్రి నిర్మించింది. గాయపడ్డవారికి వైద్య సేవలు అందించిం ది. భుజ్ స్థాయిలో వచ్చిన మరో భూకంపం..లాతూర్. మహారాష్ట్రలోని లాతూర్ లో 1993 సెప్టెంబరు 30 న భారీ భూకం పం సంభవించింది. మరికొన్ని గంటల్లో తెల్లవారుతుందనగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2 గా నమోదైంది. ఈ భూకంపం ఫలితంగాపదివేల మందికి పైగా ప్రజలు చనిపోయారు. ముప్ఫయి వేల మందికి పైగా గాయపడ్డారు.

భూకంప వార్త వినగానే షోలాపూర్ డాక్టర్లు బృందాలుగా లాతూర్ చేరుకున్నారు. గాయపడ్డవారికి వైద్య సాయం అందిం చారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అలాగే ఇండియన్ ఆర్మీ , మహారాష్ట్ర రిజర్వు పోలీసులు, కేంద్ర రిజర్వు పోలీ సులతో పాటు మిగతా చారిటీ సంస్థలు స్పందించాయి. బాధితులకు అవసరమైన సాయాన్ని అందించాయి. మనదేశం లో అనేక ప్రాంతాలకు భూకంపాల ప్రమాదం పొంచి ఉంది. అగర్తలా, ఇంఫాల్, కొహిమా, అమృత్‌సర్ , ఢిల్లీ , మీరఠ్‌, పాట్నా, చెన్నై, ముంబై, కోల్‌కతా నగరాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని, ఎన్ జీ ఆర్ ఐ సైంటిస్టులు గతంలోనే హెచ్చరించారు. అంతేకాదు ఉత్తరాఖండ్‌ లోని జోషిమఠ్‌ పట్టణం కూడా ….. డేంజర్ లిస్టులో ఉందంటున్నారు సైంటి స్టులు. భూమి కుంగడం, పగుళ్ల కారణంగా కిందటేడాది జోషిమఠ్ పట్టణం వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. జోషి మఠ్ లో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

భూకంపాలను తట్టుకునే నిర్మాణాలపై ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే భూకంపాలు సంభ విస్తే వ్యవహరించాల్సిన తీరుపై కూడా ప్రజలకు అవగాహన అవసరం. ఈ విషయంలో జపాన్ మిగతా దేశాలతో పోలిస్తే చాలా ముందుంది. సహజంగా జపాన్ లో భూకంపాలు తరచుగా వస్తుంటాయి. దీంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం తగ్గించు కోవడానికి జపాన్ ముందు చూపుతో వ్యవహరిస్తోంది. ఇలాంటి ముందుచూపు భారత్ లో కనిపించడం లేదు. అందుకే జనసాంద్రత ఉన్న అనేక ప్రాంతాలు, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి తూట్లు పొడవటం, నిబంధనలను తుంగలో తొక్కి విచ్చలవిడిగా భవంతుల నిర్మాణం చేయ డం ఇటీవల ఎక్కువైంది. ఇప్పటికైతే బండి నడవ్వొచ్చు కానీ ఏదో ఒక రోజు పర్యవసానాలు దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు.ఏమైనా జపాన్ విపత్తు చూసి భారత్ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. మనదేశం లోనూ భూకంపాలు సంభవించే ప్రాంతాలున్నాయి.వీటిమీద పాలకులు వెంటనే దృష్టి పెట్టాలి. నిబంధనలను గాలికొ దిలేసి ఆకాశాన్ని తాకే భవనాలను నిర్మించడం మానుకోవాలి. పర్యావరణవేత్తల సూచనలు పాటించాలి.లేదంటే, పర్య వసానాలు తీవ్రంగా ఉంటాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply