జాతీయ వార్తలు

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్, భారీగా తగ్గిన గోల్డ్‌ ధరలు.

న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దిగి రావడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే పసిడి రేట్లు దిగి వచ్చాయని తెలియజేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో అమెరికా డాలర్ పుంజుకోవడంతో ప్రభావం బంగారం ధరలపై పడిందని నిపుణులు వివరిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వు ఫెడ్ రేటు పెంపు అంచనాల వల్ల డాలర్ మళ్లీ బలపడుతోందని పేర్కొంటున్నారు. అందుకే పసిడిపై ప్రభావం పడుతోందని తెలియజేస్తున్నారు.

అయితే ఇటీవల క్రమంగా బంగారం ధర తగ్గుతోంది. గడిచిన వారం రోజుల్లో ఏకంగా 6సార్లు బంగారం ధర తగ్గడం విశేషం. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపిపించింది. తుల గోల్డ్‌పై రూ. 120 వరకు తగ్గింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,880 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,780గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది. విశాఖటపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.

Leave a Reply