ఆంధ్రప్రదేశ్

రైతుకు న్యాయం చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యం

ఇచ్చాపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర భూసర్వేకు రైతులు సహకరించాలని తహసీల్దార్ జి. ఎస్. వి ప్రసాద్ కోరారు. సోంపేట మండలంలోని బెంకిలి సచివాలయం పరిధిలో నిర్వహిస్తున్న రీసర్వేను సోమవారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు తమ పట్టా పాసుపుస్తకాలతో రీసర్వేకు సహకరించాలన్నారు. ప్రతీ రైతుకూ న్యాయం చేయడమే ప్రభుత్వ సదుద్దేశం అన్నారు. గ్రామ రెవెన్యూ అధికారి సంతోష్, సర్వేయర్ టి. ధనలక్ష్మి ఉన్నారు.

Leave a Reply