తెలంగాణ

కేసీఆర్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ తొలగింపు.. Y కేటగిరీకి కుదించిన ప్రభుత్వం

KPS డిజిటల్ నెట్‌వర్క్, తెలంగాణ :- ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ కొత్త ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కు భద్రతను కుదించింది. ఇప్పటి వరకూ జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న కేసీఆర్ కు Y కేటగిరీ భద్రతను ఏర్పాటు చేశారు. Y కేటగిరీ భద్రత కింద కేసీఆర్ కు 4 ప్లస్ 4 గన్ మెన్లతో పాటు.. ఇంటి దగ్గర సెంట్రీ ఉంటుంది. ఆయన కాన్వాయ్ కు సంబంధించి ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తారు.

రాష్ట్రంలో మాజీ మంత్రులుగా పనిచేసి.. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి 2 ప్లస్ 2 భద్రతను కల్పించింది రేవంత్ ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లకు పూర్తిగా భద్రతను తొలగించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. పలు అంశాలపై సమీక్షలు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీల సెక్యూరిటీ పై కూడా సమీక్షించారు. భద్రత అవసరమైన వారికి, ఏజెన్సీ ఏరియాల్లో ఉన్నవారికి గన్ మెన్లను కేటాయించవచ్చని తెలుస్తోంది. దీనిపై పూర్తిగా రివ్యూ చేశాకే తుది నిర్ణయం తీసుకుంటారు.

Leave a Reply