ఆంధ్రప్రదేశ్

విజయవాడలో తల్లి, సోదురుడు.. విశాఖ జైలులో కోడికత్తి శ్రీను నిరాహార దీక్ష..

KPS డిజిటల్ నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్‌ :- ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు దీక్షకు దిగారు. అతడు తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు విజయవాడలో దీక్ష చేపట్టారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో నగరంలోనే ఓ ఇంట్లో దీక్ష ప్రారంభించారు. తన కుమారుడికి న్యాయం జరగాలనే నిరవధిక నిరాహార దీక్షకు దిగామని శ్రీను తల్లి తెలిపారు. కోర్టుకు వచ్చి జగన్ సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలు తమకు మద్దతివ్వాలని కోరారు.

మరోవైపు విశాఖ జైలులో కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు నిరాహార దీక్ష చేపట్టాడు. అతడికి విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక మద్దతు ప్రకటించింది. జైలులో శ్రీనివాసరావుతో దళిత సంఘం నేత డాక్టర్‌ బూసి వెంకట్రావు ములాఖత్‌ అయ్యారు. దీక్షకు దళిత సంఘాలన్నీ మద్దతిస్తున్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సీఎం వైఎస్ జగన్ కోర్టుకు రావాలని కోరారు. సాక్ష్యం చెప్పి శ్రీనివాసరావుకు బెయిల్‌ వచ్చేలా చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply