జాతీయ వార్తలు

సోషల్ మీడియా ప్రచారంలో ఈ పార్టీలే టాప్

KPS డిజిటల్ నెట్‌వర్క్, న్యూఢిల్లీ :- లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అంతకు ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల ప్రచారాల్లో ఎవరెరవరు ఎంతెంత ఖర్చు పెట్టారు అని చూస్తే అందరికంటే బీజేపీ, వైసీపీనే అని తేలింది. మెటా యాడ్ లైబ్రరీ ప్రకారం ఈ విరాలను సేకరించారు.

సోషల్ మీడియా(Social Media) ప్రజల జీవితంలో బాగం అయిపోయింది. పొద్దున లేచిన దగ్గర నుంచీ రాత్రి పడుకునే వరకూ అన్ని విషయాలనూ జనాలు ఇందులో పంచుకుంటున్నారు. రాజకీయ పార్టీలు(Political Parties) కూడా సోషల్ మీడియాను తెగ వాడేసుకుంటోంది. దీని ద్వారా అయితే ప్రజలను మరింత తొందరగా చేరుకుంటామనే ఉద్దేశంతో పార్టీలు సోసల్ మీడియాలో తెగ ప్రచారాలు చేస్తున్నారు. దాంతో పాటూ పక్క పార్టీలను విమర్శించడానికి, తిట్టడానికి కూడా ఉపయోగించుకుంటున్నాయి.

అయితే మెటా యాడ్ లైబ్రరీ(Meta Ad Library) డేటా ప్రకారం దేశంలో అందరి కంటే బీజేపీ(BJP) సోషల్ మీడియా యాడ్స్(Social Media Ads) కోసం ఎక్కువ ఖర్చు చేస్తోందని తేలింది. గడిచిన 90 రోజులను పరిగణనలోకి తీసుకుని ఈ లెక్కలను తెలిపింది. బీజేపీ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని వైసీపీ ప్రభుత్వమే ఈ ప్రచారాల కోసం ఎక్కువ ఖర్చు పెడుతోంది. అయితే ఇందులో బీఆర్ఎస్(BRS) కానీ, కాంగ్రెస్(Congress) కానీ పెద్ద యాక్టివ్‌గా లేదని సర్వే చెబుతోంది. మెటా యాడ్ లైబ్రరీ ప్రకారం సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనలు అన్నీ ఒడిశా ప్రభుత్వం అందరి కంటే ఎక్కువగా 3.67 కోట్లు ఖర్చు పెడుతుండగా. ఉత్తరప్రదేశ్ 3.66 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ 3.60 కోట్లు ఖర్చు చేస్తున్నాయి.

బీజేపీనే టాప్..

ఇక దేశ వ్యాప్తంగా బీజేపీ పార్టీ సోషల్ మీడియా రాజకీయ ప్రకటనల కోసం ఆరు కోట్లు ఖర్చు చేసింది. ఇదంతా కేవలం గడిచిన 90 రోజుల్లో మాత్రమే. ఉల్తాచష్మా పేరుతో ₹2 కోట్లు, ఫిర్ ఎక్బర్ మోడీ సర్కార్ ₹1.9 అనే పేరుతో ఫేస్‌బుక్‌ పేజీకి వెచ్చించింది. ఇందులో ఉల్టా చష్మా ఫేస్‌బుక్ ప్రకటనలు ఎక్కువగా ప్రతిపక్ష రాజకీయ పార్టీలను విమర్శించేవిగా ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో…

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో ఫేస్‌బుక్‌లో బీజేపీ ₹15 లక్షలు ఖర్చు చేసింది. మన మోదీ పేరుతో రూ.8 లక్షలు, MyGovIndia పేరుతో రూ.6 లక్షలు పెట్టింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో, జగనే కావాలి అనే పేరుతో ఒక ఫేస్‌బుక్ పేజీకి ₹39 లక్షలు ఖర్చు చేసింది వైసీపీ పార్టీ. జగనన్న సురక్ష యాడ్‌ కోసం 37 లక్షలు, జగనన్న తోడుగు యాడ్‌కు 29 లక్సలు ఖర్చు పెట్టింది.

Leave a Reply