ఆంధ్రప్రదేశ్

పలాస పీఠం దక్కేదెవరికి..? అప్పలరాజుకు షాక్ తప్పదా..?

KPS డిజిటల్ నెట్‌వర్క్, శ్రీకాకుళం :- శ్రీకాకుళం జిల్లాలోని పలాస సెగ్మెంట్ జీడిపప్పు ఇండస్ట్రీకి ఫేమస్. ఈ పట్టణానికి వైట్ గోల్డ్ సిటీగా పేరుంది. పలాస జీడిపప్పు అంటే గుర్తు పట్టని వారు ఉండరు. అంతటి టేస్ట్, క్వాలిటీకి పెట్టింది పేరు. పలాస నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. అంతకు ముందు ఇది సోంపేట నియోజకవర్గంలో భాగంగా ఉండేది. సోంపేట అంటే టీడీపీ, టీడీపీ అంటే సోంపేట అన్నంతగా పాతుకుపోయింది. ఇక్కడ గౌతు కుటుంబానిదే రాజకీయ ఆధిపత్యంగా ఉండేది. టీడీపీ సీనియర్ నేత గౌతు శ్యాం సుందర్ శివాజీ 1985 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. అలాగే 2014లో పలాసలో గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఇక్కడ టీడీపీ గెలవగా.. ఆ తర్వాత ఒకసారి మాత్రమే విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో సీదిరి అప్పలరాజు(Seediri Appalaraju) వైసీపీ నుంచి గెలిచి హవా మార్చేశారు. మరి వచ్చే ఎన్నికల్లో ఓటర్ల నాడి ఎలా ఉండనుంది? KPS టీవీ డీటెయిల్డ్‌ ఎక్స్‌క్లూజివ్‌ సర్వే రిపోర్ట్‌లో ఏం తేలిందో చూద్దాం.. అంతకు ముందు 2019 ఎన్నికల ఫలితాలు ఓసారి పరిశీలిద్దాం.

2019 RESULTS : సీదిరి అప్పలరాజు VS గౌతు శిరీష

YCP 51%
TDP 40%
JANASENA 4%
OTHERS 5%

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పలాసలో వైసీపీ టిక్కెట్ పై సీదిరి అప్పలరాజు పోటీ చేయగా.. టీడీపీ నుంచి గౌతు శిరీష బరిలో నిలిచారు. టీడీపీకి స్ట్రాంగ్ హోల్డ్ అయిన పలాసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు పోటీ చేసి గెలిచారు. 51 శాతం ఓట్లు సాధించారు. అలాగే టీడీపీ నుంచి పోటీ చేసిన గౌతు శిరీష(Gouthu Shirisha) 40 శాతం ఓట్లు సాధించారు. ఇక్కడ జనసేన అభ్యర్థి 4 శాతం ఓట్లు తెచ్చుకున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా జగన్ హవా, ఫ్యాన్ గాలి బలంగా వీయడంతో పలాసలో వైసీపీ గెలిచింది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లోనూ వీరిద్దరి మధ్యే ప్రధానంగా పోరు ఉండే అవకాశాలున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య ద్విముఖపోరు ఖరారు ఖాయంగా కనిపిస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థుల ప్రభావం పలాస సెగ్మెంట్ లో ఎలా ఉంది? ప్రజల స్పందనేంటి? KPS టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

సీదిరి అప్పలరాజు (YCP)

సీదిరి అప్పలరాజు ప్లస్ పాయింట్స్

వైఎస్ జగన్ ఆశీస్సులు
బీసీ కళింగ కమ్యూనిటీ బలమైన సపోర్ట్
ఆరోగ్య సమస్యలున్న వారికి ఆర్థిక సహాయాలు

సీదిరి అప్పలరాజు మైనస్ పాయింట్స్

ప్రజలతో సరైన సమన్వయం నెరపకపోవడం
జీడిపప్పు రైతులకు సరైన మద్దతు ధర కల్పించకపోవడం
వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి చివరిదాకా సాగు నీరు అందించకపోవడం

గౌతు శిరీష (TDP)

గౌతు శిరీష ప్లస్ పాయింట్స్

టీడీపీ సంప్రదాయ ఓటర్ల బలమైన మద్దతు
తండ్రి సుదీర్ఘ రాజకీయ వారసత్వం
గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతి
పార్టీ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లడం
గ్రౌండ్ లెవెల్ లో ప్రచారం ముమ్మరం చేయడం

గౌతు శిరీష మైనస్ పాయింట్స్

బీసీ కళింగ కమ్యూనిటీ ఓటర్ల మద్దతు లేకపోవడం
కులాల వారీగా
మత్స్యకారులు 29%
కళింగ 26%
యాదవ్ 8%
ఎస్సీ 6%
ఎస్టీ 6%
షెట్టి బలిజ 2%

పలాసలో మత్యకారుల వర్గ అందులో ఉప వర్గాల జనాభా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత కళింగ కమ్యూనిటీ డామినెంట్ గా కనిపిస్తోంది. మరి పలాసలో పోటీ చేసే అభ్యర్థులు, పార్టీల వారీగా వివిధ సామాజికవర్గాల అభిప్రాయం ఎలా ఉంది? KPS టీవీ సర్వేలో వాళ్లు చెప్పిన ఒపీనియన్ ఎలా ఉందో ఓసారి చూద్దాం. మత్స్యకారుల్లో పల్లి అనే ఉప వర్గం 17 శాతం ఉంది. వడ బలిజ వర్గానికి చెందిన వారు 10 శాతం ఉన్నారు. జాలరి వర్గానికి చెందిన వారు 2 శాతం మంది ఉన్నారు. వీరంతా కలిపి టీడీపీకి 35 శాతం సపోర్ట్ గా ఉంటామంటున్నారు. అదే సమయంలో జనసేనకు 60 శాతం మంది మద్దతు ఉంది. కేవలం 5 శాతం మంది మాత్రమే వైసీపీకి అనుకూలమంటున్నారు.

ఇక కళింగ కమ్యూనిటీలో 60 శాతం మంది టీడీపీ, 35 శాతం జనసేన, 5 శాతం వైసీపీకి మద్దతుగా ఉంటామని KPS టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. అటు యాదవ వర్గంలో టీడీపీకి 50 శాతం, జనసేనకు 45 శాతం, వైసీపీకి 5 శాతం సపోర్ట్ ఇస్తామంటున్నారు. ఎస్సీల్లో 35 శాతం తెలుగుదేశం, 60 శాతం జనసేన, 5 శాతం వైసీపీకి సపోర్ట్ ఇస్తామనగా, ఎస్టీల్లో టీడీపీ జనసేన కూటమికి 50 శాతం, అటు వైసీపీకి 50 శాతం మంది మద్దతు పలుకుతున్నారు. షెట్టిబలిజ వర్గానికి చెందిన వారిలో టీడీపీకి 60 శాతం, జనసేనకు 35 శాతం, వైసీపీకి 5 శాతం మంది సపోర్ట్ ఇస్తామని KPS టీవీ సర్వేలో తమ అభిప్రాయాలు చెప్పారు.

ఇక వచ్చే ఎన్నికల్లో పలాసలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

గౌతు శిరీష vs సీదిరి అప్పలరాజు

TDP 48%
YCP 46%
OTHERS 6%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. పలాసలో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషకు ఎడ్జ్ కనిపిస్తోంది. మొత్తం 48 శాతం ఓట్ షేర్ తో గెలిచే అవకాశాలు ఎక్కువున్నట్లుగా KPS టీవీ సర్వేలో తేలింది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి మంత్రి అయిన సీదిరి అప్పలరాజుకు 46 శాతం ఓట్లు వస్తాయని ప్రజలు తమ అభిప్రాయంగా చెప్పారు. ఇతరులు 6 శాతం ఓట్లు దక్కించుకునే ఛాన్సెస్ ఉన్నాయి.

Leave a Reply