జాతీయ వార్తలు

రేపే కేజ్రీవాల్ సంచలన ప్రకటన.. కవిత గురించి ఏం చెబుతారు?

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, న్యూఢిల్లీ :- ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కేజ్రీవాల్ రేపు పూర్తి వివరాలను బయటపెడతారని ఆయన భార్య సునీత చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది.ఆయన ఏం చెబుతారన్న చర్చ జోరుగా సాగుతోంది.కవిత ప్రమేయంపై ఎలాంటి విషయాలు వెల్లడిస్తారోనని బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఉన్నారు.

దేశంలో ప్రస్తుతం అత్యంత దుమారం రేపుతున్న విషయం ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఈడీ అధికారులు వరుసగా ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. అ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఇందులో ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ రిమాండ్ మీద తీహార్ జైల్లో ఉన్నారు. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ ఈనెల 21 అరెస్ట్ చేసింది. మార్చి 28 వరకు కోర్టు ఆయనను కస్టడీకి ఇచ్చింది. అరెస్ట్ అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయని కేజ్రీవాల్ అక్కడ నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇక రేపు ఆయనను ఈడీ మరోసారి కోర్టులో ప్రవేశపెట్టనుంది.

కేజ్రీవాల్ భార్య సంచలన ప్రకటన…

కేజ్రీవాల్‌ను రేపు కోర్టులో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆయన భార్య వీడియోలో సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ రేపు కోర్టులో సంచలన విషయాలు బయటపెడతారని ఆమె పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడ ఉందో చెబుతారని.. దానికి తగిన ఆధారాలను కూడా ఇస్తారని చెప్పారు.

రేపు కోర్టులో ఏం చెప్పబోతున్నారు?

కేజ్రీవాల్ భార్య ప్రకటనతో ఇప్పుడు అందరూ రేపు ఆయన కోర్టులో ఏం చెప్పబోతున్నారు అనేది చర్చించుకుంటున్నారు. రేపు కేజ్రీవాల్ నిజంగానే కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి సంచలన విషయాలను బయటపెడతారా? ఈ కేసులో ఆయన ప్రమేయం గురించి కూడా మాట్లాడతారా? అన్న అంశంపై చర్చ సాగుతోంది. అసలు కేజ్రీవాల్‌కు ఈ కేసు గురించి ఏం తెలుసు? ఇందులో ఎవరెవరు ఉన్నారు? లాంటి విషయాలు బయటకు వస్తాయామో అని అనుకుంటున్నారు. దాంతో పాటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురించి కూడా ఏం చెబుతురోనన్న చర్చ తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సాగుతోంది. కేజ్రీవాల్ తన వాదనలో కవిత నిర్దోషి అని చెబితే.. ఆమెకు మద్దతు మరింత పెరిగే అవకాశం ఉంది.

లిక్కర్ స్కామ్ డబ్బులు ఎక్కడ?

లిక్కర్ స్కామ్ డబ్బులు ఎక్కడ ఉన్నాయో కేజ్రీవాల్‌ రేపు చెబుతారని ఆయన సతీమణి సునీత ఈ రోజు విడుదల చేసిన వీడియోలో వెల్లడించడం కూడా ఆసక్తికరంగా మారింది. మొదటి నుంచీ కేజ్రీవాల్ ఇదంతా బీజేపీ కుట్రని చెబుతున్నారు. ఇప్పుడు రేపు కోర్టులో కేజ్రీవాల్ కూడా అదే చెబుతారా? బీజేపీ వాళ్ళ దగ్గరే డబ్బులు అన్నీ ఉన్నాయని ఆయన ప్రకటిస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కవిత కూడా నిన్న ముగ్గురు బీజేపీ నేతల గురించి ప్రస్తావించారు. వాళ్లు, వీళ్ళూ ఒక్కటేనా? అని కూడా చర్చించుకుంటున్నారు. మొత్తానికి రేపు కేజ్రీవాల్ చెప్పబోయే విషయాల మీద చాలా మంది భవిష్యత్తు ఆధారపడి ఉందన్న చర్చ దేశ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. కవిత గురించి ఆయన ఏం చెబుతారోనని బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply