ఆంధ్రప్రదేశ్

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

KPS డిజిటల్ నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్‌ :- మరికొద్ది గంటల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్ చెప్పింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం ప్రియుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ డిసెంబర్ 31 నుంచి జనవరి 1వ తేది రాత్రి 11 వరకు వైన్ షాపుల పనివేళలు పొడిగిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.

ఈ ఉత్వర్వులతో మందుబాబులు నూతన సంవత్సరానికి గ్రాండ్ గా వెల్‌కమ్ చెప్పేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే బార్లు, పబ్బుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి.

ఇదిలా ఉంటే ప్రభుత్వ అనుమతితో నడిచే అన్ని ఈవెంట్స్‌కు ఈ రెండు రోజుల పాటు రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఉత్సాహం మరింత రెట్టింపు అయింది. ఇక మందేస్తూ, చిందేస్తూ కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పేందుకు మందుబాబులు ఫుల్ జోష్ మీద ఉన్నారు.

Leave a Reply