ఆంధ్రప్రదేశ్

వివేక కుమార్తె సునీతకు పోలీసులు నోటీసులు .. ఎందుకంటే..?

KPS డిజిటల్ నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్‌ :- వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డికి.. పులివెందుల పోలీసులు నోటీసులు పంపించారు. ఇందులో భాగంగా అప్పటి CBI ఎస్పీ రామ్‌సింగ్‌కూ నోటీసులు పోస్టు ద్వారా అందించారు. వివేకా హత్య కేసులో ఆయన పీఏ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా.. ముగ్గురికి 41-ఏ నోటీసులను పంపారు.

ముగ్గురుపైనా పులివెందుల కోర్టులో ఛార్జ్‌షీటు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 15న ముగ్గురుపై వివిధ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మోపిన అభియోగాలపై విచారణకు రావాల్సి ఉందంటూ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఛార్జి షీటు కూడా దాఖలు చేసినట్లు నోటీసుల్లో తెలిపారు. ఈ మేరకు ముగ్గురికి రిజిస్టర్ పోస్టు ద్వారా నోటీసులు అందించినట్లు తెలుస్తోంది.

Leave a Reply