ఆంధ్రప్రదేశ్

ఆఫీసర్లూ.. చూపించిన భక్తి చాలు.. ఈసీ ఉంది జాగ్రత్త !

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్ :- ఇది ఎలక్షన్ టైమ్.. ఇప్పటికే నేషనల్‌ వైడ్‌గా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఈ విషయాన్ని ఇంకా కొందరు అధికారులు గుర్తించినట్టు లేరు. ఇప్పటికీ ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తుతున్నారు. నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారు. అయితే ఇకపై మీ ఆటలు సాగవంటోంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్‌ ఇండియా. హద్దు దాటితే కొరడా తీస్తామంటూ వార్నింగ్ ఇస్తోంది. నాట్ ఓన్లీ వార్నింగ్. ఇప్పటికే కొందరు అధికారులపై యాక్షన్ కూడా తీసేసుకుంది. ఈ చర్యలతో ఈసీ సందేశమేంటి? ఇప్పుడు అధికారులు చేయాల్సిందేంటి?

కంట్రీవైడ్‌గా తర్వాత మాట్లాడుదాం. ఫస్ట్‌ ఏపీపై ఫోకస్ చేద్దాం. సరిగ్గా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏదైతే జరిగిందో.. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సీనే రీపిట్ అవుతోంది ఏపీలో. 2019లో ఈసీ ప్రభుత్వాధికారుల తీరుపై కొరడా ఝుళిపించింది. అప్పుడు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులతో రంగంలోకి దిగింది. దర్యాప్తు చేసింది. అప్పుడు చీఫ్‌ సెక్రటరీగా ఉన్న అనిల్ చంద్రతో సహా.. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుతో సహా.. కడప ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్‌ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంను బదిలీ చేసింది. ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ అదే సీన్ కనిపిస్తోంది. ఈసారి ఏకంగా ముగ్గురు IASలు, ఐదుగురు IPSలపై వేటు వేసింది. ఇందులో గుంటూరు రేంజ్ ఐటీ పాలరాజు కూడా ఉండటం విశేషం. వితౌట్ ఎనీ డీలే.. తమ కింది వారికి బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలంది ఈసీ. ఇది చాలదు. చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలను కూడా తప్పించాలంటోంది టీడీపీ.

ఒక్కొక్క అధికారి బదిలీకి ఒక్కో రీజన్ ఉంది. వాటి జోలికి మనం వెళ్లడం లేదు కానీ.. ఒక్క ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి ఈసీ వేట్లు. మొత్తం ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 20 మంది అధికారులపై వేటు వేసింది ఈసీ. ఏపీతో పాటు.. అసోం, బిహార్, ఒడిశా, జార్ఖండ్‌లోని.. 8 మంది IASలు, 12 మంది IPSలపై వేటు పడింది. ఇందులో 9 మంది అధికారులు ఏపీ నుంచే ఉండటం విశేషం. ఈ కౌంట్‌ ఇంకా పెరగడం ఖాయం.

ఇప్పటి వరకు బదిలీ అయిన వారి లిస్ట్‌.. వారిపై వచ్చిన ఆరోపణలు చూస్తే.. చిలకలూరిపేటలో ప్రధాని మోడీ సభలో గందరగోళం ఏర్పడింది. విధుల్లో ఉన్న ఎస్పీలు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్‌లా కాకుండా.. వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌ రెడ్డిపైనా సేమ్ ఆరోపణలు, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత గిద్దలూరు, ఆళ్లగడ్డలో జరిగిన హత్యలు, మాచర్లలో దాడులు.. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ప్రకాశం, పల్నాడు, నంద్యాల ఎస్పీలపై బదిలీ వేటు పడింది. ఇక అనంతపురం ఎస్పీ అన్బురాజన్, చిత్తూరు ఎస్పీ జాషువాలపై కూడా టీడీపీ ఫిర్యాదులు చేసింది. ముగ్గురు కలెక్టర్లపై కూడా ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి. అందుకే వారిపై కూడా చర్యలు తప్పలేదు.

ఈ బదిలీలు ఇక్కడితో ఆగుతాయా అంటే.. Without any hesitation ఆగవని చెప్పవచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా పెన్షన్‌ పంపిణీ ఇష్యూ ఏపీలో మరో రాద్దాంతానికి కారణమైంది. అటు టీడీపీ, ఇటు వైసీపీ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశాయి. ఇప్పటికే ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. కొందరు ఈసీని టార్గెట్‌ చేస్తూ కూడా విమర్శలు చేశారు. వీటన్నింటిపై ఫోకస్ చేసింది ఈసీ. అసలు తప్పు ఎక్కడ జరిగింది? దీనికి ఎవరు బాధ్యులు? అన్న దానిపై ఫోకస్ చేసింది. వెరీ సూన్.. రాష్ట్రంలో చాలా మంది అధికారులకు స్థానభ్రంశం తప్పదని క్లియర్‌కట్‌గా తెలుస్తోంది.

మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే సీన్. బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కొందరు అధికారులు ఎంత చేమటోడ్చారో చూశాం. ఏకంగా విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసి.. ఫండింగ్ అందకుండా చేయాల్సిందంతా చేశారు. ప్రజల కోసం కాకుండా.. ఓన్లీ బీఆర్ఎస్‌ కోసమే పనిచేశారు. ఫలితం ప్రస్తుతం వాళ్లు జైలుకు, కోర్టుకు చక్కర్లు కొడుతున్నారు. ఇవేవీ ఆరోపణలు కాదు.. ఏకంగా రిమాండ్ రిపోర్ట్‌లో ఉన్న విషయాలే.

అసలు అధికారులకు ఇంత స్వామి భక్తి ఎందుకన్నదే ఇప్పుడు క్వశ్చన్. ష్ట్రాలు ఏవైనా.. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఆ ప్రభుత్వ పెద్ద వర్గానికి చెందిన వారికే కీలక పోస్టులు దక్కుతున్నాయి. దీంతో ఆ పోస్టులు, కీలక శాఖలను దక్కించుకునేందుకు.. టు IASలు, ఇటు IPSలు పోటీ పడుతున్నారు. వారి మాట వింటే పోస్టు ఉంటుంది.. లేదంటే ఊస్టే. మళ్లీ పోస్టింగ్‌ ఉంటే ఉంటుంది.. లేదంటే లేదు. ఇలా తయారైంది ఏపీలో పరిస్థితి. మేము ఇక్కడ ఎవ్వరినీ టార్గెట్ చేయడం లేదు. ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు. ఏ సర్కార్‌ వచ్చినా ఇదే తీరు కంటిన్యూ అవుతోంది. దీంతో ఎందుకొచ్చిన పంచాయితీ అని జీహుజూర్ అంటూ అధికారులు కూడా కాలం గడిపేస్తున్నారు.

అయితే అధికారులు ఇక్కడ ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. వాళ్లు రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చింది. నేతల భజనలు చేయడానికి కాదు.. వారి ఆదేశాలను పాటించడానికి కాదు. వారు పనిచేయాల్సింది ప్రజల కోసం. సమాజం మేలు కోసం. వారికి జీతాలు ఇచ్చేది నేతలు కాదు. ప్రజలు కష్టార్జితం చేసి సంపాదించి ప్రభుత్వానికి కట్టే పన్నులతో.. ఈ విషయాన్ని మరిచి లైన్ దాటిన వారిపై ఈరోజు కాకపోతే.. రేపు.. రేపు కాకపోతే ఎల్లుండి.. ఎప్పుడైనా వేటు తప్పదు. ఇప్పటికైనా మేల్కోండి.. నేతల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయండి. ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించేలా చర్యలు తీసుకోండి. ఎన్నికల్లో అక్రమాలకు చాన్స్ ఇవ్వకండి. ఇదే ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది.

Leave a Reply