ఆంధ్రప్రదేశ్

సమస్యల పరిష్కారానికే జగనన్న సురక్ష

KPS డిజిటల్ నెట్‌వర్క్, ఇచ్చాపురం: ప్రజా సమస్యల పరిష్కారానికి జగనన్న సురక్ష అని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. కవిటి మండలంలోని బెజ్జిపుట్టుగ, బొరివంక గ్రామాల్లో లబ్ధిదారులకు వివిధ రకాల ధ్రువపత్రాలను జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఎంపీడీవో సూర్యనారాయణ రెడ్డి, తాసిల్దార్ పీ శేఖర్, డిప్యూటీ తాసిల్దార్ టి రామచంద్రరావు, సర్పంచులు నారాయణస్వామి, దూగాన భద్రాచలం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply