ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబానికి పరామర్శ

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఉద్దండపాలెం గ్రామానికి చెందిన మండల మహిళ సమైఖ్య అధ్యక్షురాలు చింతాడ రమణమ్మ మాతృమూర్తి మహాలక్ష్మి ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురువారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పరామర్శించిన వారిలో ఉన్నారు.

Leave a Reply