ఆంధ్రప్రదేశ్

యువతి గొంతుకోసి హత్య చేసిన యువకుడు

చిత్తూరు : తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తమ ప్రేమను కాదంటే చాలు సైకోల్లాగా ప్రవర్తిస్తూ యువతుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా ఓ సైకో చేతిలో మరో యువతి బలైంది. చిత్తూరు జిల్లా కొండమిట్ట ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వేలూరు రోడ్డులోని ఓ బ్యూటీ పార్లర్ లో ప్రశాంతి అనే యువతి పనిచేస్తోంది. అక్కడికి వచ్చిన చక్రవర్తి అనే యువకుడు ఆమె గొంతుకోసి హత్యచేశాడు. అనంతరం తానూ గొంతు కోసుకున్నాడు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కొనఊపిరితో ఉన్న యువకుడిని ఆస్పత్రికి తరలించారు. మృతురాలు చిత్తూరు తాలూకా స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నాగరాజు కుమార్తెగా గుర్తించారు. తమ కుమార్తె మతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave a Reply