ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇక్కడే కొనసాగించాలి: బండారు

KPS డిజిటల్ నెట్‌వర్క్, కొత్తపేట: ఆలమూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అమలాపురం తరలిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హేయమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కళాశాలను ఆలమూరులోనే కొనసాగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు కళాశాల వద్ద బండారు సత్యానందరావు , తెలుగుదేశం శ్రేణులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారని ఆలమూరు మండల తెలుగుదేశం పార్టీ తెలిపింది.

Leave a Reply