తెలంగాణ

హైద‌రాబాద్‌లో దంచికొడుతున్న వాన‌.. 122. 4 మి. మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు

KPS డిజిటల్ నెట్‌వర్క్, మేడ్చల్: రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో వాన దంచికొడుతోంది. గ‌త మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలో వర్షపాతం గణనీయంగా పెరిగింది. సాధార‌ణంగా జులై 20వ తేదీ నాటికి హైద‌రాబాద్ న‌గ‌రంలో స‌గ‌టున 101. 2 మి. మీ. వ‌ర్ష‌పాతం న‌మోదవుతుంది. అయితే ఈ ఏడాది ఈ స‌మ‌యం నాటికి సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే అధిక వ‌ర్ష‌పాతం న‌మోదైంది. 122. 4 మి. మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

Leave a Reply