క్రీడా వార్తలు

పతకం గెలిచిన ఆనందంలో చిందేసిన భారత అథ్లెట్

న్యూఢిల్లీ : అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌ పోటీల్లో భారత్‌ తరఫున లాంగ్ జంప్ ఈవెంట్‌లో 17 ఏళ్ల షైలీ సింగ్ రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆనందంలో ఆమె మైమరిచి చిందేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో షైలీ చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన షైలీ.. నైరోబి ప్రపంచ జూనియర్‌ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌ పోటీల్లో 6.59 మీటర్లు దూకి రజతం సాధించింది.

Leave a Reply