క్రీడా వార్తలు

ICC టెస్టు ర్యాంకింగ్స్: ఆరో స్థానానికి పడిపోయిన కోహ్లీ

ICC టెస్టు : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) లేటెస్టుగా ర్యాంకులు విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదో స్థానం నుంచి ఆరోస్థానానికి పడిపోయాడు. ఫామ్ లో ఉన్న ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ ఓ స్థానం మెరుగుపరుచుకుని ఐదోస్థానానికి చేరుకున్నాడు. వరుసగా సెంచరీల మోత మోగిస్తున్న ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి జో రూట్ ICC ర్యాంకుల్లో ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు.

బౌలింగ్ ర్యాంకుల్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపర్చుకుని పదో ర్యాంకుకు చేరుకున్నాడు. బౌలింగ్ లిస్టులో ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ పాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఎలాంటి మార్పులేదు. టీమిండియాతో టెస్టు సిరీస్ లో సత్తా చాటుతున్న ఇంగ్లండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ‘ఆరు’ నుంచి ఐదోస్థానానికి చేరుకున్నాడు.

Leave a Reply