ఆంధ్రప్రదేశ్

పలాసలో రోడ్డు ప్రమాదం కారు ధ్వంసం

పలాస : పలాస మండలం గొల్ల మాకన్నపల్లి జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వాటర్ పైపులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసం కాగా కారులో ఉన్న ప్రయాణికులు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Leave a Reply